కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు మానవత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఆమె త్రిస్సూర్ జిల్లాలోని ఇరంజలకుడి ప్రాంతంలో పర్యటించారు. అక్కడ జరిగిన సమావేశంలో వివేక్ ప్రభాకర్ (27) పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. కిడ్నీ మార్పిడికి ఆర్థిక స్తోమత లేదనే విషయం తెలుసుకుని వెంటనే స్పందించారు. తన చేతికున్న బంగారు గాజులను తీసి అతడి చేతిలో పెట్టారు. మంత్రి మంచి మనసును పలువురు అభినందిస్తున్నారు.