ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజపక్స శ్రీలంక విడిచిపోవడానికి మేం సహకరించలేదు... భారత హైకమిషన్ స్పష్టీకరణ

international |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 05:35 PM

రాజపక్స శ్రీలంక విడిచి వెళ్లిపోయే ప్రయాణాన్ని భారత్ సులభతరం చేసిందనే ప్రచారంలో నిజం లేదని ఆ దేశంలోని భారత హైకమిషన్ తేల్చి చెప్పింది. ఇదిలావుంటే శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని కార్యాలయం కూడా ధ్రువీకరించింది. భార్య, ఇద్దరు బాడీ గార్డ్స్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన పరారయ్యారు.  శ్రీలంక సైన్యానికి అధిపతి కూడా అయిన దేశాధ్యక్షుడికి ఉన్న కార్యనిర్వాహక అధికారాల ప్రకారమే ఆయన తరలింపు జరిగిందని ఆ దేశ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. మాల్దీవుల్లోని వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ల్యాండ్ అయ్యారు.


మరోవైపు, రాజపక్స స్వదేశం నుంచి పారిపోవడానికి భారత్ సాయం చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని శ్రీలంకలోని భారత హైకమిషన్ ఖండించింది. ఈ ప్రచారం నిరాధారమైనదని తెలిపింది. రాజపక్స శ్రీలంక విడిచి వెళ్లిపోయే ప్రయాణాన్ని భారత్ సులభతరం చేసిందనే ప్రచారంలో నిజం లేదని చెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com