ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే, అక్కడ కూడా రాజపక్సకు వ్యతిరేకంగా లంకేయులు నిరసనలు చేపట్టడంతో.. గురువారం అక్కడి నుంచి సింగపూర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మాల్దీవుల నుంచి ప్రత్యేక జెట్‌లో సింగపూర్‌కు వెళ్లేందుకు సాయం చేయాలని, రాజపక్స మాల్దీవుల ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.