మొబైల్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. తక్కువ ధరలో ఎం13 సిరీస్ ఫోన్లను ఉత్తర కొరియాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీ భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. 4జీతోపాటు, త్వరలో రానున్న 5జీ సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను శామ్ సంగ్ తీసుకొచ్చింది. 4జీ, 5జీ వెర్షన్లలో ఫీచర్లు భిన్నంగా ఉన్నాయి. వీటి ధరలు రూ.11,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.
శామ్ సంగ్ గెలాక్సీ ఎం13 4జీలో 4జీబీ ర్యామ్, 64జీబీ ధర రూ.11,999. అలాగే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.13,999. ఇక ఎం 13 5జీలో 4జీజీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.13,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.15,999. మిడ్ నైట్ బ్లూ, ఆక్వా గ్రీన్, స్టార్ డస్ట్ బ్రౌన్ రంగుల్లో ఇవి లభిస్తాయి.
4జీ వేరియంట్ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, శామ్ సంగ్ సొంత ప్రాసెసర్ అయిన ఎక్సినోస్ 850 ఉంటుంది. వర్చువల్ గా ర్యామ్ విస్తరించుకునే ఆప్షన్ ఉంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. వెనుక భాగంలో 50 పిక్సల్ ప్రధాన కెమెరా సహా మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు.
5జీ వేరియంట్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ఎస్ వోసీ చిప్ తో వస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జర్ సదుపాయంతో ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగా పిక్సల్ సహా రెండు కెమెరాలు, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.