చీరాల: తమ డిమాండ్ల సాధనకై నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వినూత్నంగా అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ ఏఐటీయూసీ వారికి సంఘీభావం తెలిపాయి.
సీఎం జగన్ మాటల్లో కాకుండా చేతల్లో కార్మికుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు జీతం తగ్గింపును వారు ఖండించారు. పోరును ఉధృతం చేస్తామన్నారు