కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. 3 రోజుల క్రితం యూఏఈ నుంచి వచ్చిన ప్రయాణికుడిలో లక్షణాలను గుర్తించి పూణేలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ కు పంపారు.
ఈ పరీక్షల్లో అతనికి పాజిటివ్ గా తేలిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి,గ్రంధులవాపు,అలసట,చలి,దద్దుర్లు,గజ్జి ఈ వ్యాధి లక్షణాలు. దీనికి టీకా లేదు. కోతులు,ఎలుకల ద్వారా ఇది వ్యాపిస్తుంది.