సీఎం జగన్ కి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ విష ప్రచారానికి పరిమితమైందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ ఏడుపులు మొదలుపెట్టారు. ప్రభుత్వంపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్పై విష ప్రచారానికి టీడీపీ పరిమితమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్పష్టంగా తమ నిర్ణయం ప్రకటిస్తున్నా, వారు వాస్తవాలు గుర్తించడం లేదు. ప్రజల అవసరాలు గుర్తించి, వారికి మేలు చేయకపోతే, ఎవరూ ఆదరించరన్న వాస్తవాన్ని కూడా గుర్తించడం లేదు. సీఎం వైయస్ జగన్ ఆ పని చేస్తున్నారు కాబట్టే, ఆయనను ప్రజలంతా ఆదరిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు అని తెలియజేసారు.