గుంటూరు, మాచర్ల: నాగార్జునసాగర్ జలాశయంలో ప్రవాహం పెరుగుతుంది. నీరు పరవల్లు తొక్కడంతో ఈదురు గాలుల నేపథ్యంలో నిత్యం నాగార్జున సాగర్ నుంచి నాగార్జున కొండకు వెళ్లే పర్యాటకుల లాంచీలు నిలిపివేశారు. కొండపై విధులు నిర్వహించేందుకు వెళ్లాల్సిన పురావస్తు శాఖ సిబ్బంది ఆగిపోయారు. లాంచిస్టేషన్ ప్రవేశ ద్వారం మూసివేశారు. గాలుల తీవ్రత తగ్గేంతవరకు లాంచీలు ముందుకు కదలవని స్టేషన్ మేనేజర్ స్వామి తెలిపారు.