ఒడిశాలోని ఢెంకనాల్లో దారుణం జరిగింది. నకపోడి మఝీ అనే వ్యక్తి తన భార్య శుచలను గొడ్డలితో నరికి చంపాడు. నరికిన తలను చేతిలో పట్టుకుని నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కి బయల్దేరాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య తనను మోసం చేసిందనే అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.