కేరళలో మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో కలవొద్దని చెప్పింది. జ్వరం, చర్మ దద్దుర్లు వంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలని, ఇలాంటి లక్షణాలు ఉన్న వారి వస్తువులను ఇతరులు వాడొద్దని పేర్కొంది. అటవీ జంతువుల మాంసాన్ని తినొద్దని సూచించింది.