ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జగన్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంపై తెలుగుదేశం నాయకులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులపై వేధింపులకు పాల్పడుతుందని అన్నారు.