ప్రకాశం జిల్లా గిద్దలూరు నరవ గ్రామాల మధ్య ఉన్న పొలాలలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
తక్షణమే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు పడిపోయిన కరెంటు స్తంభాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.