బేస్తవారిపేట మండలం సింగరపల్లి, మల్లాపురం గ్రామాలలో జనసేన పార్టీ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబు మరియు కార్యకర్తలు పర్యటించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న రోడ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రోడ్లు వేయడంలో నిర్లక్ష్యం వహించి మొద్దు నిద్ర పోతుందని ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబు విమర్శించారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.