ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ధరలకే విత్తనాలు ఎరువులు అమ్మాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 08:52 PM

విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే అమ్మకాలు చేపట్టాలని శంఖవరం వ్యవసాయ అధికారి పి. గాంధీ ట్రేడర్లకు సూచించారు. శుక్రవారం కాకినాడ జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపుడి లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను సందర్శించి స్టాకును, రిజిష్టర్ లను తనిఖీలు చేశారు.


ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ, ట్రేడర్లు షాప్ ల వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని, లైసెన్సులను రెవిన్యువల్ తప్పకుండా చేయించుకోవాలన్నారు. అనంతరం విత్తన నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం నియోజకవర్గంలోని ప్రయోగశాలకు పంపించారు. అనంతరం రైతులతో వరి నారు మడులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు ప్రభాస్, చిన్నబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com