యూపీలోని షాజహాన్పూర్లో లిక్కర్ మాఫియా దారుణానికి పాల్పడింది. ఇస్తెఖార్, షబ్బూ అనే ఇద్దరు యువకులను ఇటీవల నలుగురు గ్యాంగ్స్టర్లు పట్టుకున్నారు. వారిపై కాల్పులు జరిపి, ఆపై కర్రలతో దాడి చేశారు. దాహం వేస్తుందని బాధితులు అడగగా వారు మూత్రం ఇచ్చారు. వారు మూత్రం తాగుతుండగా వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. ఇది వైరల్ కావడంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.