చంద్రబాబు, టీడీపీ అడాన్ కంపెనీపై దుష్ర్పచారం చేస్తున్నారు. మా కుటుంబానికి అడాన్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు అని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.... ఆయనకు చెందిన ఇతర కంపెనీల్లో అవినీతి జరిగింది. హెరిటేజ్ ఫుడ్స్‌లో వడ్లమూడి నాగరాజు డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి కూడా ఆ కంపెనీలతో సంబంధం ఉన్నట్టేనా? అని ప్రశ్నించారు. అలానే రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనవసరంగా అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోము. పరిధి దాటవద్దని చంద్రబాబు, లోకేష్‌కు వార్నింగ్ ఇస్తున్నాను. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారు. మా పార్టీపై బురద జల్లడం మానుకోవాలి. కార్పొరేట్ రంగంలో చంద్రబాబుకు ఉన్న చర్రిత మరెవరికీ లేదు. వరసకు చంద్రబాబు నాకు అన్న అవుతారు. నా భార్య బంధువును తారకరత్న పెళ్లి చేసుకున్నారు. అలా అయితే చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా?. చంద్రబాబు ఈడీ కేసుల్లో ఇరుకున్నారు కదా? ఆ క్వారీ ఓనర్లు చంద్రబాబు పార్ట్నర్లు కాదా? చంద్రబాబు, ఆ క్వారీ ఓనర్లు మెగా బిడ్ అనే ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? .మేకా యుగంధర్‌ను ఆ కంపెనీ నుంచి రాజీనామా చేయించి నారా కుటుంబం ఆ కంపెనీని తీసుకుంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.