శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో సప్త నదుల సంగమ ప్రదేశంలో వెలసిన శ్రీలలితాసంగమేశ్వరాలయం క్రమంగా నీటిమునుగుతూ వస్తుంది. దీంతో ఆదివారం ఆలయ ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ సంగమేశ్వర ఆలయం శిఖరాగ్రానికి కి విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా వరద జలాలకు గంగా హారతిని నివేదించారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 24 గంటల్లోగా సంగమేశ్వరాలయం నీటిమునగనుంది.