పిడుగురాళ్లలో 80 ఏళ్ల ముసళ్ళమ్మని అల్లుడు బ్రహ్మం నరికి చంపాడు. పట్టణంలోని పల్నాడు హాస్పిటల్ వెనుక నివాసం ఉంటున్న గుదె కస్తూరమ్మ ఇంటి వరండాలో నిద్రిస్తున్న సమయంలో తలపై బలంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
కూతురి భర్త నల్లబోతుల బ్రహ్మమే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. బ్రహ్మం పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎందుకు చంపాడు అనే విషయం తెలియాల్సి ఉంది.