తాడేపల్లి: మండల పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో నిషేదిత గుట్కాల విక్రయిస్తున్న దుకాణం పై తాడేపల్లి పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో దుకాణంలోని సుమారు రూ ఐదు వేల విలువైన నిషేదిత గుట్కాలని స్వాధీనం చేసుకుని దుకాణ దారునిపై కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గుట్కాల విక్రయం నేరమని పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా గుట్కాల విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.