పోలవరం ముంపు మండలాలు వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, ఎటపాక, రామచంద్రాపురం, కూనవరం, దేవీపట్నం ప్రజలంతా రంపచోడవరం నియోజవర్గ పరిధిలో పడుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రికి కనబడడం లేదా ? అని టీడీపీ నాయకులూ ప్రశ్నించారు. పోలవరం ప్రాంతం ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన పరిహారం హామీ రూ.19లక్షలు, రూ.10లక్షలు మాటలు గుర్తున్నాయా? ఈ రోజుకి కనీసం 10 పైసలైనా ఇచ్చావా? అని అడగటం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల ప్రభావం వలన వచ్చిన వరదల నేపథ్యంలో ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని, వారికీ ఇంతవరకు ప్రభుత్వం నుండి సాయం అందలేదు అని వాపోయారు. పోలవరం పనులు ఎక్కడివి అక్కడే నిలిపేసి , నెపం మాత్రం టీడీపీ మీద వేస్తున్నారు అని వాపోయారు.