27 ఏళ్ల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దాష్టికలు, దారుణాలపై బలంగా పోరాడారు. అప్పట్లో పేరు గురించో, చరిత్ర గురించో ఆలోచించి ఆయన పోరాటం చేయలేదు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహ నిర్మాణానికి ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎందుకు ముందుకు రావాలి..? ఇంతటి గొప్ప స్ఫూర్తి ప్రదాత విగ్రహం ప్రభుత్వమే పెట్టొచ్చు కదా..! అని జనసేన నాయకులూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వం వస్తే కచ్చితంగా జాతీయ నాయకుల విగ్రహాలను భావితరాలకు స్ఫూర్తివంతంగా ఉండేలా పెడతాం. అల్లూరి లాంటి విశ్వనరుడు జనసేనకు స్ఫూర్తి ప్రదాత. భీమవరంలో అల్లూరి విగ్రహ ఆవిష్కరణకు స్థానిక నియోజకవర్గ ఎంపీను సైతం రాకుండా వైసీపీ అడ్డుకునే పరిస్థితి లో నేను రావడం సరికాదు అనే భావనలో రాలేదు. శ్రీ రఘురామకృష్ణంరాజు మాపై గత ఎన్నికల్లో పోటీ చేశారు. మాకు ఆయనకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా, ఒక పార్లమెంటు సభ్యుడుకి జరిగిన అవమానాన్ని సాటి మనిషిగా అర్థం చేసుకొన్నాను. ఆయనకి జరిగిన అవమానం క్షత్రియ సమాజానికి జరిగిన అవమానమే అని ఆవేదన వ్యక్త పరిచారు.