ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నాయకులను ఆదేశించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. సచివాలయం విజిట్ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని సీఎం ప్రకటించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రిజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఇప్పటికే గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలు.. మూడేళ్లలో ప్రజలకు ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తున్నారు. అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టారు. ప్రతినెలా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. రెండో నెల కూడా సీఎం జగన్ సమీక్షను నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.