విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నాడని భారత వికెట్ కీపర్ కమ్ ఫినిషర్ దినేష్ కార్తీక్ అన్నాడు. విరాట్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌ను తొలగించలేమని చెప్పాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలోనూ 33 ఏళ్ల కోహ్లి పేలవ ఫామ్ ను కొనసాగించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ తన కెరీర్లో చాలా కష్టమైన రోజులు ఎదుర్కొంటున్నాడు. చివరిసారిగా 2019లో సెంచరీ సాధించగా.. ఆ తర్వాత తన మార్క్ స్థాయిలో రాణించలేకపోయాడు.. కెప్టెన్సీకి రాజీనామా చేసి పూర్తిగా లయ కోల్పోయాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శనను కొనసాగించిన కోహ్లి.. టీమ్ ఇండియా తరఫున కూడా ఎలాంటి ప్రభావం చూపని బ్యాట్స్‌మెన్‌గా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.