కాకినాడలోని ఉప్పాడ సముద్ర తీరంలో ఆవిష్కృతమైన అద్భత దృశ్యం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నీలం రంగులో ఉండే సముద్రంలోకి భారీ వర్షాల కారణంగా వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో సముద్రంలో వేర్వేరు రంగుల్లో ఉన్న గోదావరి, సముద్రం జలాలు కనువిందు చేస్తున్నాయి. వరద నీరు సాగర జలాలతో పూర్తిగా కలవడానికి వారం రోజుల సమయం పడుతుందని మత్స్య కారులు చెబుతున్నారు.