ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఏ సోదాలు కలకలం సృష్టించాయి. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఏకకాలంలో ప్రకాశం జిల్లా, విజయవాడ, నెల్లూరులో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కల్యాణ్ రావు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. శిరీష ఇంట్లో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ సోదాలు చేపట్టడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఉదయం 3 గంటల నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి.