హర్యానాలోని ఆరావళి పర్వత శ్రేణి సమీపంలోని నుహ్ పచ్‌గావ్‌లో మైనింగ్ మాఫియా బరితెగించింది. ఓ పోలీసు అధికారిని మంగళవారం ట్రక్కుతో గుద్ది చంపింది. అక్రమ మైనింగ్‌పై సమాచారం రావడంతో డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ అక్కడకు వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా, ఓ ట్రక్కు డ్రైవర్ రాళ్లతో నిండిన ట్రక్కును సురేంద్ర సింగ్‌పై నుంచి పోనిచ్చాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.