పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచడం వల్ల భద్రాచలం ముంపుకు గురైందన్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలను తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యహరించాలని హితవు పలికారు. పోలవరం నిర్మాణం అనుమతి పొందిన డిజైన్లతోనే జరుగుతోందని తెలిపారు. ముంపు మండలాల ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబసభ్యులని ఆయన స్పష్టంచేశారు.