గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాల్లో ఇంజిన్ సమస్యలు ఏర్పడ్డాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఆ రెండు విమానాలను దారి మళ్లించారు. ముంబై నుంచి లేహ్, ఆ తర్వాత శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాల్లో ఈ సమస్యలు చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంజిన్లో సమస్యలొచ్చాయని, ఆ సమస్యలను పరిష్కరించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. ఇటువంటి సమస్యలు మళ్లీ రాకుండా జాగ్రత్తపడుతామన్నారు.