దాచేపల్లి మండలం కొత్తూరు కు చెందిన భూక్యాశివ నాయక్ భార్య పూరిబాయ్ (52)కి నలుగురు తమ్ముళ్లు, ఒక అన్న ఉన్నారు. ఆమెకు అన్నదమ్ములతో కొంతకాలంగా పొలం వివాదం నడుస్తోంది.
పొలం విషయమై ఇరువర్గాలు మంగళవారం రాత్రి ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో పూరీ బాయి ని ఆమె తమ్ముళ్లుకర్రతోకొట్టడంతోతీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను పిడుగురాళ్ల కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.