కడప-రాయచోటి రహదారిలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గల వైఎస్సార్ సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన సూరారెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ రెడ్డి తెలిపారు.
సూరారెడ్డి తన కారును వైఎస్సార్ సర్కిల్ వద్ద ఉంచగా భగత్ సింగ్ నగర్ కి చెందిన రాజ్ కుమార్, లింగారెడ్డి పల్లెకు చెందిన శ్రీను అతనిపై దాడి చేసి సెల్ ఫోన్, పర్సు తీసుకున్నారు. దీంతో సూరారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడంతో మంగళవారం వారిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్సై తెలిపారు.