ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగతీసుకుని తరువాత పెళ్లి చేసుకోనని ముఖం చాటేసిన మోసగాడిపై కేసు నమోదు చేసినట్లు రిమ్స్ ఏఎస్సై యోగయ్య తెలిపారు.
కడప నగరానికి చెందిన యువతి (22)ని అదే ప్రాంతానికి చెందిన బాలకుమార్ ప్రేమించి పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.