ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన తోపుడు బండి వ్యాపారి రామేశ్వర్ దయాల్ తన భూమికి పట్టా ఇప్పించాలని మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై ఇద్దరు హైకోర్టుకు వెళ్లారు. కోర్టుకు వచ్చిన దయాల్‌ను చూసిన న్యాయమూర్తి బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఆయనకు ఇద్దరు బాడీగార్డులను నియమించారు.