ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వ్యవహారంతో పార్టీకి ఏ మాత్రం సంబంధంలేదు: కేశినేని చిన్ని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 04:13 PM

కారు స్టికర్ వ్యవహారంపై స్పందిస్తూ ఇది కుటుంబ సమస్య పార్టీకి, చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధం లేదని కేశినేని నాని సోదరుడు,  కేశినేని చిన్ని వెల్లడించారు. టీడీపీ లో తాను సాధారణ కార్యకర్తను మాత్రమే అన్నారు కేశినేని చిన్ని. తన సోదరుడు కేశినేని నానితో విభేదించలేదని, తనను విజయవాడ నుంచి పోటీ చేయమని ఎవరూ అడగలేదన్నారు. పార్టీలో తనకు ఏ హోదా లేదని కేసుతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబు ఏ ఆదేశాలు ఇస్తే అదే చేస్తానని, పార్టీ అధికారంలోకి రావడానికి అవసరమైన కార్యక్రమాలు చేయడానికే తాను ఉన్నాను అన్నారు. కారుకు సంబంధించిన విషయంపై స్పందించారు.. కుటుంబపరంగా చిన్న, చిన్న వివాదాలు జరుగుతుంటాయని, ఈ చిన్న విషయాన్ని ఇంత దూరం లాగడం బాధగా అనిపించిందన్నారు. తన భార్యను లాగడం సరికాదని, ఈ విషయం నిన్న ఉదయమే తనకు తెలిసిందన్నారు.


హైదరాబాద్ పోలీసులు కారును తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారని, తర్వాత తిరిగి కారును తన దగ్గరికి పంపారన్నారు చిన్ని. తాను వ్యాపారులెవరిని బెదిరించలేదని వ్యాపారులను ఎవరిని కలిశానో నిరూపించాలి అన్నారు. ఇన్నాళ్లుగా లేనిది ఈ రెండు నెలల నుంచే ఆరోపణలు ఎందుకు వచ్చాయన్నారు. హైదరాబాద్ వెళుతూ మార్గ మధ్యలో రైతు పోరు సభ పనులు పరిశీలించేందుకు ముందు రోజు వెళ్లానన్నారు. కుటుంబ సమస్యల్ని, ఆడవాళ్లను వివాదాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదని.. ఇది కుటుంబ సమస్య పార్టీకి, చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధం లేదన్నారు.


ఇదిలావుంటే  విజయవాడ ఎంపీ కేశినేని నాని మే 27న విజయాడ పటమట పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని.. విజయవాడ ఎంపీగా తాను ఉపయోగించే వీఐపీ వాహన స్టిక్కర్ లాంటిదే నకిలీది తయారు చేసుకుని విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతున్నారని కంప్లైంట్ చేశారు. వాహనం నంబర్ టీఎస్07హెచ్‌డబ్ల్యూ 777 అని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ప్రస్తావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com