టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు వంగలపూడి అనిత మరీ దిగజారిపోయి సీఎం వైయస్ జగన్ భార్య వైయస్ భారతమ్మ గురించి విమర్శలు చేస్తుందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తెలియజేసారు. మిడిల్ ముఖంగా ఆమె మాట్లాడుతూ... భారతమ్మ పేరు ఎత్తే అర్హత అనితకు లేదన్నారు. భారతమ్మ కాలిగోటికి కూడా అనిత సరిపోదని చెప్పారు. భారతమ్మ ఏరోజూ రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఇన్వాల్వ్ అవ్వలేదని అన్నారు. బాధ్యతాయుతమైన మహిళగా భారతమ్మ ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లు నారా భువనేశ్వరి ఎన్ని సూట్కేసులు మోసిందని, లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో బ్రాహ్మిణి ఎన్ని సూట్కేసులు మోశారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు.