లక్షలాది కుటుంబాలకు మంచి జరగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని వైసీపీ నాయకులూ కోరారు. ఇందుకు తమవంతుగా సోషల్ మీడియాలో వారియర్లుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్నారా? అని పిలుపునిస్తున్నారు. జగనన్న ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా?. అయితే జగనన్న సోషల్ మీడియా వారియర్ గా చేరండి, ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకు జగనన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు మీ ద్వారా చేరవేయండి!. జగనన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లండి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వేదికగా పోస్టులు, ప్రత్యేక కథనాలు రాసి మనవంతు సాయంగా జగనన్నకు అండగా నిలుద్దాం అని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరల గెలుపు కోసం వైసీపీ నాయకులూ కార్యకర్తలకి పిలుపునిస్తున్నారు.