అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు అనంతపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో చైన్ స్నాచింగులు జరుగకుండా ఉండేందుకు కొనసాగుతోన్న పోలీసుల ముందస్తు చర్యలు. హోంగార్డుల నుండీ SI,CI సి.ఐ ల వరకు ఒంటరిగా ఉన్న ఇళ్ల ప్రాంతాలు, శివారు కాలనీల్లో ఈరోజు సంచరించారు. తెల్లవారుజాము 5 గంటలకే గస్తీలు చేపట్టి మార్నింగ్ వాక్ కు వెళ్లేవారు, ఇళ్ల ముందు కసువు ఊడ్చడం, ముగ్గులు పెట్టడం లాంటి పనులలో నిమగ్నమైన మహిళల్లో అవగాహన చేశారు. శివారు కాలనీల్లోని మహిళలతో సమావేశమై చైన్ స్నాచింగులు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యం చేశారు. అనుమానితులు, అపరిచితులు కాలనీలు, శివారు ప్రాంతాలలో సంచరిస్తే వెంటనే డయల్-100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.