ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు రావలసిన ఆదాయాన్ని ఎపి బెవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లించి, ఈ మళ్లించిన ఆదాయాన్ని ఆ కార్పొరేషన్ ఆదయంగా చూపిస్తూ ఆ కార్పొరేషన్ పేరు మీద అప్పులు చేస్తుందని ఈరోజు పార్లమెంటులో వైసీపీ ఎంపీ రఘు రామ రాజు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అప్పులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. లేదంటే శ్రీలంకలో ఏర్పడిన ఆర్ధిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.