ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు&రిటైర్డ్ అయిన ఇద్దరు హోంగార్డులకు అనంతపురం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS చెక్కులు అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 29 న హిందూపురం హోంగార్డు పి.సీతారామాంజినేయులు అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన భార్య అనూరాధమ్మకు రూ. 4,37,400/- లు... ఈ ఏడాది మార్చి 12 న మృతి చెందిన నిర్మలాదేవి కొడుకు విష్ణువర్ధన్ కు రూ. 25,800/-లు, రిటైర్డ్ అయిన హోంగార్డులు వన్నూరప్పకు రూ 42,000/-, లక్ష్మినరసమ్మకు రూ. 13,800/- ల మొత్తాన్ని చెక్కు రూపంలో ఎస్పీ అందించారు. జిల్లా హోంగార్డులు తమ గౌరవ వేతనంలో ఒక రోజు వేతనాన్ని ఇలా సహచర కుటుంబాలకు అందజేయడం అభినందనీయమని ఎస్పీ పేర్కోన్నారు.