కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారుకు మధ్య సన్నిహిత సంబంధమే ఉంది. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలకు వైసీపీ మద్దతు కేంద్రానికి చాలా అవసరమైంది. బీజేపీ పెద్దలు కోరినట్టే సీఎం జగన్ సైతం స్నేహహస్తం అందించారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు బీజేపీ నేతలు.. అయితే ఈ బంధం వచ్చే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగవచ్చని.. ఎందుకంటే అన్ని విషయాల్లో కేంద్రానికి వైసీపీ మద్దతు ఇస్తూనే ఉంది. దీంతో అంతా అలానే భావించారు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. కేంద్రం పెద్దల వ్యాఖ్యల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ.. వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఏపీ అప్పుల విషయంలో కేంద్రం చేసిన సంచలన వ్యాఖ్యల వివాదం ముదరకముందే.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ (Piyus Goyal) మరో వివాదానికి తెరలేపారు. ఏపీకి సంబంధించిన బియ్యం సేకరణ పైన క పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ వర్సస్ కేంద్రం అన్నట్లుగా సాని వ్యవహారంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ సీఐకు ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక హెచ్చరిక చేశారు కేంద్రమంత్రి గోయల్. ఏపీలో ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచీ బియ్యం, వడ్ల సేకరణను నిలిపేయాల్సి వస్తుందని స్పష్టం చేసారు. ఎందుకంటే ఏపీలో చాలా నెలల నుంచి కేంద్రం ఇవ్వాల్సిన ఉచిత బియ్యం పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. దీనీపై ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియచేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ ఆరు నెలలుగా ఆ బియ్యం పంపిణీ జరగడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పీఎంజీకేఏవై 6వ దశ కింద ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.
ఈ దశ కింద 8.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్టానికి కేటాయించడమని పియూష్ గోయల్ స్పష్టం చేశారు. అయితే ఇలా బియ్యం తీసుకుని.. ఏ రాష్ట్రమైనా ఈ కేంద్ర పథకాన్ని అమలు చేయకపోతే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోకక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశం పైన పార్లమెంట్ లో టీడీపీ సభ్యుడు కేశినేని అడిగిన ప్రశ్నకు సభలో మంత్రి పీయూష్ సమాధానం ఇచ్చారు.
ఈ పథకం కింద ఏపీకి గత అయిదు విడతల్లో 23,75,496 మెట్రిక్ టన్నులు అందించామని వెల్లడించారు. అయితే, ఏపీలో ఇప్పటి దాకా ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడంపై రాష్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయ్యిందని.. అయితే తమ వద్ద తగిన నిల్వలు ఉన్నాయని చెబుతూ.. ప్రత్యేకంగా సమస్యలను చెబుతూ ఆలస్యమైందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆయన వెల్లడించారు. ఈ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు పీయూష్ తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి.