వర్షాకాలంలో పాదాలు ఎక్కువగా నీటిలో నానుతుంటాయి. అందుకే పాదరక్షల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బూట్లను ధరించకూడదు. నీటిలో పాదాలు ఎక్కువ సేపు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.
అందుకే పాదాలకు గాలి తగిలేలా ఉండే చెప్పులను వేసుకోవాలి. వర్షాకాలంలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక పాదాలను లిక్విడ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. సబ్బుతో గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి, ఆ తర్వాత పాదాలను బాగా తుడుచుకోవాలి.