జీర్ణశక్తి బాగుంటే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. జీర్ణశక్తి బాగుంటే బరువు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే నీళ్ళు బాగా తాగాలి. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్ళు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా నీళ్లు తాగడం వల్ల అన్నం తినేటప్పుడు దాహం వేయదు. నీళ్ళు ఒక రోజుకు కనీసం 5 లీటర్లు తాగితే జీర్ణ సమస్యలు తలెత్తవు.