గోదావరి పరిసర ప్రాంతాలలో , వరద బాధితులకి సహాయం చేసే నిమిత్తం టీడీపీ అది నాయకులూ చంద్రబాబు నాయుడు నిన్న, ఈ రోజు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న అనుకోని పరిస్థితుల్లో చిన్న పరమార్ధము జరిగింది. దీనిపై స్పందించిన టీడీపీ నాయకులూ మాట్లాడుతూ... ప్రమాదాలు, ప్రాణాపాయాలు ఆయనకు కొత్తకాదు. ప్రజల ఆశీస్సులున్నంతవరకు ఆయనకు ఏమీకాదు. అదే ఆయన ధీమా! కోనసీమ జిల్లా సోoపల్లి వద్ద చంద్రబాబుగారు ప్రయాణిస్తున్న పంటు ర్యాంపు తెగింది. దీంతో తెలుగుదేశం నేతలు, ఎన్ఎస్జీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు నీటిలో పడిపోయారు. వెంటనే లైఫ్ జాకెట్లు వేసి వారిని సిబ్బంది కాపాడారు. చంద్రబాబుగారు అప్పటికే బోటు మారడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.