ఇటీవల అనంతపురం జిల్లా గుంతకల్లు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో డబ్బు కోసం కిడ్నాప్ చేసిన కేసులో ఉన్న నిందితులపై కైం నంబర్లు 1) CR.No.107/22 U/S 364, 364 A, 120 (B) R/w 34 IPC and Sec 25 (1b) (a) of Indian Arms Act of Guntakal rural P.S. 2) CR.No.108/22 U/S 364, 364 A, 120 (B) R/w 34 IPC and Sec 25 (lb) (a) of Indian Arms Act of Guntakal rural P.S. నమోదయ్యా యి. సదరు కేసుల దర్యాప్తులో భాగంగా సుంకర ప్రసాద్ నాయుడుని అదుపులో తీసుకుని విచారించగా... గతంలో మీరు అతనిని ఇంటర్వూ చేసి ఆ వీడియోను యూట్యుబ్ లో అప్ లోడ్ చేశారు. సదరు వీడియోలకు ప్రేరేపితమై గుంతకల్లు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని జి.కొట్టాలకు చెందిన మోహన్ నాయుడు ఆకర్షితుడై సుంకర ప్రసాద్ నాయుడిని సంప్రదించాడు. ధనంవంతుల జాబితా సేకరించి వారిలో ఒకర్ని కిడ్నాప్ చేసి రూ.26 లక్షలు దోచుకోవడం జరిగింది. ఈ సంగతిని అరెస్టయిన నిందితుల కన్ఫెషన్ రిపోర్టులో నమోదు చేయడం జరిగింది.
నేర రహిత సమాజం స్థాపించడంలో మీడియా ఎంతో కృషి చేస్తోంది. కానీ... నేర చరిత్ర కల్గిన సుంకర ప్రసాద్ నాయుడును మీరు ఇంటర్వూ చేస్తూ వాస్తవాలను వక్రీకరించి (Mis information | అతిశయోక్తితో కీరించి (glorification )క్రిమినల్ ను హీరోగా చూపుతూ ఆ వీడియోలను యూట్యుబ్ లో అప్ లోడ్ చేశారు. తప్పుడు సమాచారం కల్గిన వీడియోలను అప్ లోడ్ చేసిన లింకులను తొలగించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. లేనిపక్షంలో న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రులకు మనవి చేస్తూ నేరాన్ని, నేరస్తులను హీరోలుగా చూపించడం సభ్య సమాజ దృష్టిలో మంచిది కాదని హితువు పలుకుతున్నాము అని అనంతపురం ఎస్పీ తెలియజేసారు.