దాదాపు ప్రతి వంటలోనూ కొత్తిమీర వేస్తుంటారు. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-ఏ, సీ, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తప్రసరణ పెంచడంతో పాటు బీపీ కారణమయ్యే సోడియాన్ని బయటకు పంపుతుంది.