అర్థరాత్రిళ్లు ఇంటి చుట్టూ తిరుగుతూ చుట్టుపక్కల ప్రజలని భయబ్రాంతులకు గురిచేస్తూ.. ఏంటి ఈ గృహ నిర్బంధాలు.? అని జనసేన వీర మహిళా సౌజన్య ప్రియా ప్రశ్నించారు. ఆమెను గృహ నిర్బంధం చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేయండి అని ప్రశ్నించడం తప్పా..? ఎన్నాళ్ళు ఈ అరాచకాలుఅని ప్రశ్నించారు. మహిళా నాయకురాలునీ గృహ నిర్భంధం చేయడానికి మహిళా పోలీసులు ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలా చేస్తారు ? ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న జగన్ నిరంకుశత్వ ప్రభుత్వానికి ప్రజలే త్వరలో బుద్ది చెప్తారు అని తెలియజేసారు.