రాష్ట్రంలో ప్రతి సోమవారం జరిగే "స్పందన" కార్యక్రమంలో భాగంగా అర్జీలను అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. B.సత్యనారాయణ స్వీకరించారు. చట్టపరిధిలో విచారణ జరిపి నిర్దిష్ట సమయంలోపు పరిష్కారం చూపాలని జిల్లా లోని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు, IPS., ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శ్రీ B.సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు " స్పందన" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ప్రత్యక్షంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, అర్జీదారులతో మాట్లాడి, వారి సమస్యలను విని, సమస్యలను సత్వరం పరిష్కరించ వలసిందిగా సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తగు ఆదేశాలను జారీ చేసారు.