జార్ఖండ్‌లోని బొకారో ప్రాంతంలో దారుణం జరిగింది. 9వ తరగతి బాలికను మనోజ్, విష్ణు, మంటోష్ అనే ముగ్గురు వ్యక్తులు అపహరించారు. గదిలో బంధించి, 3 నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. జులై 19న బాలికను ఓ మహిళ విడిపించింది. ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పింది. గతంలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు మరోసారి పోలీసులకు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.