మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మరోసారి మండిపడ్డారు. తన తండ్రి స్థాపించిన శివసేనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టంచేశారు. సీఎం పదవి పోయినప్పటికీ తనకు ఎలాంటి బాధ లేదని అన్నారు. షిండేతో పాటు కొందరు శివసేన నేతలపై తాను అపారమైన నమ్మకం పెట్టుకున్నానని, జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పిదం అదేనని తెలిపారు. కోర్టులో తామే గెలుస్తామని ఉద్ధవ్ ధీమా వ్యక్తం చేశారు.