సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఊడిమూడిలంకలో వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరదలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వస్తే డ్రామాలు ఉంటాయని, పదిరోజుల తర్వాత వస్తే మంచిగా ఉంటుందని అన్నారు. అధికారులంతా కష్టపడి పనిచేశారని కొనియాడారు.
అదే మాజీ సీఎం చంద్రబాబు అయితే వరదలు వచ్చిన వెంటనే వచ్చేవారని, సొంత మీడియాలో ప్రచారం చేసుకునేవారని విమర్శించారు. పెదపూడి లంక వద్ద వంతెన నిర్మాణం నెల రోజుల్లో ప్రారంబిస్తామన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ఆదుకుంటామని, నష్టపరిహారం అందిస్తామని సీఎం జగన్ బాధితులకు హామీ ఇచ్చారు.