ఇటీవల భారత రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన యశ్వంత్ సిన్హా తన తదుపరి కార్యాచరణపై నోరు విప్పారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని ఆయన ప్రకటించారు. ఇంతవరకూ తాను ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపలేదని, తనతో ఎవ్వరూ మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతం 84ఏళ్లు నిండిన ఆయన ప్రజాజీవితంలో ఏ విధంగా కొనసాగాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa